Posts

Showing posts from August, 2019

*బ్రేకింగ్ న్యూస్ :-*

*రాష్ట్రంలోని అన్ని ఆలయాల ట్రస్ట్ బోర్డులు రద్దు . .* *త్వరలోనే కొత్త ట్రస్ట్ బోర్డుల నియామకం చేస్తాం :* *రాజకీయాలకు అతీతంగా సేవ చేసే వారికే పెద్ద పీట* *అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యం ఇస్తాం* *వినాయక చవితి నాడు  కాణిపాకంతోనే మొదలు.* *దేవదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు..*

ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకూ

* అరగంట ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి * రేప‌టి నుంచి సచివాలయం ఉద్యోగాలకు పరీక్షలు * తొలిరోజు 12.54 లక్షల మంది హాజరు * 1.26 లక్షల పోస్టులకు 21.68 లక్షల మంది పోటీ * మొత్తం 5,134 పరీక్షా కేంద్రాలు * సుదూర ప్రాంతాల అభ్యర్థులకు ఉచితంగా భోజనం, తాత్కాలిక వసతి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకూ రాత పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలకు 21,69,814 మంది హాజరు కానున్నారు. మొత్తం 36,449 కార్యదర్శుల పోస్టులకు 12,54,071 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సెప్టెంబరు ఒకటో తేదీన వీరికి రాత పరీక్ష ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి, వార్డు ప్రణాళిక కార్యదర్శి, విద్యా డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి పోస్టులకు ఎక్కువమంది పోటీ పడటం, సెప్టెంబరు ఒకటో తేదీ ఆదివారం తొలిరోజు 12.54 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానునుండడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనం, తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,134

విఆర్వో హత్యకేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు.

కృష్ణాజిల్లా తిరువూరులో పట్టణంలో జరిగిన విఆర్వో హత్యకేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు.. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చిన పోలీసులు.. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు.. హత్యను ఛేదించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న-డిఎస్పీ హత్యకు పాల్పడిన ప్రధాన నిందురాలు గతంతో ఒక హత్యకేసులో పలు నేరాల్లో పాల్పడింది-డీఎస్పీ హత్యను ఛేదించిన తిరువూరు సీఐ ఎస్. ప్రసన్నవీరయ్య గౌడ్, ఎస్సైలు సుబ్రహ్మణ్యం,అవినాష్,, సిబ్బందిని అభినందించిన-డీఎస్పీ సిబ్బందికి రివార్డులు అందజేసిన -డిఎస్పీ బి. శ్రీనివాసులు..

👉 ఆది, సోమవారాల్లో, కోస్తాలో చాలాచోట్ల మోస్తరు జల్లులు.

👉 ఆది, సోమవారాల్లో, కోస్తాలో చాలాచోట్ల మోస్తరు జల్లులు. 👉 ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు  ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని 48 గంటల్లో అల్పపీడనం అభివృద్ధి చెందుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా అభివృద్ధి చెంది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీనికి సమాంతరంగా దక్షిణ కోస్తాంధ్ర, పరిసరాల్లో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఐఎండి తెలిపింది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు, అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం విజయనగరం, శ్రీకాకుళంలో పలుచోట్ల జల్లులు, శ్రీకాకుళంలోని మెళియపుట్టిలో భారీ వర్షం నమోదైనట్లు పేర్కొన్నారు...

జీడీపీ తగ్గుదలపై నిపుణులు ఏం చెబుతున్నారు..?

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గిందంటే ఎవరిపై అధిక ప్రభావం చూపుతుంది..? జీడీపీ తగ్గుదలపై నిపుణులు ఏం చెబుతున్నారు..? ప్రతీ త్రైమాసికంలో తగ్గుతూ వస్తున్న జీడీపీ ఆర్థిక వ్యవస్థలో లేని సమతుల్యత .. న్యూఢిల్లీ: ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ స్థూల దేశీయ ఉత్పత్తి 5శాతానికి పడిపోయిందని చెబుతూ సంచలన నివేదికను వెల్లడించింది. అయితే జీడీపీ పడిపోవడం వల్ల నష్టపోయేది దేశంలోని పేద ప్రజలే అని నిపుణులు చెబుతున్నారు. జీడీపీ పడిపోయిన ప్రతి సందర్భంలోనూ సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు ఒక వ్యక్తి సగటు ఆదాయంపై కూడా ప్రభావం చూపడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా సన్నగిల్లుతాయని నిపుణులు చెబుతున్నారు. 2018- 19 ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి నెలవారీ తలసరి ఆదాయం రూ.10,534 ఉంటే... వార్షిక జీడీపీ 5శాతం వృద్ధిలోకి వచ్చిందంటే 2020 ఆర్థిక సంవత్సరానికి నెలవారి తలసరి ఆదాయం రూ. 526 పెరుగుతుందని ఇందిరాగాంధీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్‌లో ఎకానామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్. నాగరాజ్ తెలిపారు. ఇలా కాకుండా నె

కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి ...

ముంబై : మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధూలే జిల్లా సిర్‌పూర్ గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. సిలిండర్ పేలుడుతో మంటలు ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారుుల చెప్తున్నారు. అగ్నిప్రమాద సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలో ఉన్న ఇతర కార్మికులను సిబ్బంది కాపాడారు. సిలింబర్ పేలుడుతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 8 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సిలింబర్ పేలుడుకు గల కారణం తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కంపెనీ సరైన భద్రతా చర్యలు తీసుకుందా ? లేదా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.

బొమ్మకు ట్రీట్‌మెంట్‌ చేస్తేనే ఆమె కూడా బుద్ధిగా ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటోంది.

న్యూఢిల్లీ :  చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కుప్పలు కుప్పలుగా బొమ్మలు ఉండడం సర్వసాధారణం. వాటితో ఆటలే చిన్నారులకు కాలక్షేపం. కొందరు పిల్లలకు బొమ్మలతో ఉండే అనుబంధం మాటల్లో చెప్పలేనిది.  పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ వాటితోనే ఆడతారు. తమకు ఇష్టమైన బొమ్మ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. తన బొమ్మ అంటే ఎంత ఇష్టమంటే.. ఆ బొమ్మకు ట్రీట్‌మెంట్‌ చేస్తేనే ఆమె కూడా బుద్ధిగా ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటోంది. దీంతో చేసేది ఏమి లేక చిన్నారి బొమ్మను... పాపతో పాటే బెడ్‌పై పడుకోబెట్టి ట్రీట్‌మెంట్ చేశారు డాక్టర్లు.  ఈ విచిత్ర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.   ఢిల్లీకి చెందిన  ఆ చిన్నారి పేరు జిక్రా మాలిక్. వయసు 11 నెలలు. జిక్రా దగ్గర ఓ అందమైన బొమ్మ ఉంది. పేరు పారీ.  పారీ అంటే జిక్రాకు ఎంతో ఇష్టం. అది లేనిదే ఏ పనీ చేయదు. బొమ్మకు పాలు పడితేనే జిక్రా పాలు తాగుతుంది. బొమ్మకు గోరుముద్దలు పెడితేనే జిక్రా తింటుంది. అదీ ఆ బొమ్మతో చిన్నారికి ఉన్న అనుబంధం. కాగా, ఆగస్టు 17న బెడ్‌పై నిద్రిస్తున్న సమయంలో అనుకోకుండా జిక్రా కిందపడింది. ఈ ఘటనలో ఆమె కాళ్లకు గాయాలు అయ్యాయి. దీంతో ట్రీట్‌మెంట్‌ కోసం ఆ చి

యురేనియం కార్పొరేషన్ వ్యర్ధాలపై తనిఖీకి ప్రభుత్వ ఆదేశం

క‌డ‌పః  కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలో యురేనియం కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ వ్యర్ధాలపై ప్రభుత్వం తనిఖీకి ఆదేశించింది. యురేనియం కార్పొరేషన్ వలన భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం తనిఖీ, అధ్యయనానికి ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి దీనిపై ప్రభుత్వ నిపుణుల కమిటీని నియమించింది. వ్యర్ధాలు నిల్వచేస్తున్న పాండ్, పరిసరాలలో భూగర్భ జలాల కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలపై అధ్యయనం చేసి కలుషితం అవుతున్నాయా లేదా అన్నది తేల్చాలని నియంత్రణ మండలి ఆదేశించింది. కమిటీలో సభ్యులుగా ఎన్జీఆర్ఐ, జియాలజీ, భూగర్భ జల విభాగం, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఏపీ గనులు, వ్యవసాయ శాఖ, తిరుపతి ఐఐటీ నుండి నిపుణులు ఉన్నారు.

వన మహోత్సవాన్ని ప్రారంభించిన సిఎం జగన్‌

గుంటూరు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో శనివారం ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సిఎం జగన్‌ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. వన మహోత్సవాల్లో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం రాత పరీక్షలకు పక్కాగా అన్ని ఏర్పాట్లు

సుదూరప్రాంత ‘సచివాలయ’ ఉద్యోగార్థులకు ఉచిత భోజనం ఏర్పాటు _పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ అమరావతి: రాష్ట్రంలో 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం సెప్టెంబరు 1 నుంచి నిర్వహిస్తున్న రాత పరీక్షలకు పక్కాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా, హాజరయ్యాక నిమిషం ముందుగా వెళ్దామన్నా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని వెల్లడించారు. గిరిజా శంకర్  విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఇప్పటికీ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోని అభ్యర్థులకు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటూ వారి మొబైళ్లకు సంక్షిప్త సమాచారాన్ని పంపిస్తున్నాం.  పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సిరీస్ కోడ్తోపాటు ఇన్విజిలేటర్ సంతకం పెట్టించుకోవాలి. అభ్యర్థి సంతకం తప్పనిసరి. పరీక్షలు నిర్వహించిన రోజుల్లో ఆర్టీసీ తరఫున ప్రత్యేకంగా

అదుపు తప్పి కారు బోల్తా ....

గుంటూరు జిల్లా : తుళ్లూరు మండలం మందడం సమీపంలో గల సీడ్ ఎక్సిస్ రోడ్డు వద్ద కారు ప్రమాదం ఉదయం సమయంలో సుమారు 100 నుండి 110 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రక్కనే ఉన్న కంకరు కుప్పను ఢీకొనడంతో తలక్రిందులు ఆయన వాహనం కారులో ప్రయాణిస్తున్న వ్యక్తుల కు తీవ్రం గాయాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరుజిల్లా: నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య మృతుడు ఓజిలి మండలం కురుగొండ గ్రామానికి చెందిన చెన్నూరు రాజగోపాల్(49) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలింపు.

ఓ బాలికపై అత్యాచారం

లక్నో : ఓ బాలికపై అత్యాచారం జరిపిన కేసులో పోస్కో ప్రత్యేక కోర్టు విచారణను కేవలం 9 రోజుల్లోనే ముగించి సంచలన తీర్పు వెలువరించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో వెలుగుచూసింది. ఔరాయియా పట్టణానికి చెందిన నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆగస్టు నెల 1వతేదీన కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని 2వతేదీన అరెస్టు చేశారు. యూపీ డీజీపీ ఓపీ సింగ్ ఆదేశంతో ఈ కేసులో ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ నెల 18వతేదీన పోస్కో ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీంతో ఈ కేసు దర్యాప్తును కేవలం 9 రోజుల్లో ముగించిన కోర్టు జడ్జి దోషికి జీవిత ఖైదు విధించారు. దీంతోపాటు రెండులక్షల రూపాయల జరిమానా విధించి, ఆ మొత్తాన్ని బాలిక కుటుంబానికి అందించాలని ఆదేశించారు. ఈ కేసు తీవ్రత దృష్య్టా కేవలం 9 రోజుల్లోనే విచారణ ముగించి ఆగస్టు 29వతేదీన తీర్పు వెలువరించారు.ఇలా ఇంత తక్కువ సమయంలో తీర్పు చెప్పిన ఘటన దేశంలోనే మొట్టమొదటి సారి అని పోలీసులు చెప్పారు.

అసోంలో జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది

దిల్లీ: అసోంలో జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది . సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాబితాలో లేనివారి పేర్లను మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. 3.11కోట్ల మందికి తుది జాబితాలో చోటు దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో భారీగా భద్రతా బలగాలను మొహరించింది. గువాహటిలోని సచివాలయం, అసెంబ్లీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 144సెక్షన్‌ విధించారు. సున్నితమైన కశ్మీర్‌ అంశం ఇంకా చల్లారకముందే మరో కీలక అంశం ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల కావడం గమనార్హం. జాబితాలో లేనివారికి కేంద్రం భరోసా... శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రబలగాలను రాష్ట్రంలో భారీగా మోహరించారు. మరోవైపు జాబితాలో లేనివారి కోసం కేంద్రం ఉపశమన చర్యలు చేపట్టింది. జాబితాలో లేకపోయినా ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించబోమని ప్రకటించింది. విదేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్‌లో తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టీకరించింది. ఎవరినీ నిర్బంధించబోమంటూ హామీ ఇచ్చింది. ప్రస్తుతం అందుతున్న

గ్రామ సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల రాత పరీక్షలు 9 జిల్లాల్లో నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది

అమరావతి: రాష్ట్రంలో గ్రామ సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల రాత పరీక్షలు 9 జిల్లాల్లో నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది . సెప్టెంబరు 1 నుంచి 8 వరకు నిర్వహించనున్న సచివాలయ రాత పరీక్షలకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల రాత పరీక్షలు రాసే అభ్యర్థులకు నిరాశ మిగిల్చింది. నెల్లూరు, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఈ పరీక్షలు నిలిపేయాలని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో సైట్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్న సిబ్బంది మొదట హైకోర్టును ఆశ్రయించి తమను రెగ్యులర్‌ చేసే అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని రెండు వారాల్లోపు పరిష్కరించి, వాటి నియామకాల కోసం నిర్వహిస్తున్న రాత పరీక్షలను నిలిపేయాలని ఆదేశించింది. ఆ తర్వాత మరో 8 జిల్లాల్లోను ఇదే తరహా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. సర్వేయర్ల పోస్టులకు సంబంధించి కూడా వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్టే ఉత్తర్వులిచ్చింది. దీంతో పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో పాటు ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు లీగ

👉దారుణం.. భర్తే కాలయముడు

👉దారుణం.. భర్తే కాలయముడు 👉విజయవాడ రూరల్ మండలం నిడమానూరు లో.ని  రామ్ నగర్ లో హత్య......... 👉భర్త సోమేలు, భార్య అశ్విని(28)సం లు , వీరికి ఇద్దరు పిల్లలు పాప( 7)సం లు బాబు (4), సం లు. 👉భర్త సోమేలు లారీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. 👉గత రాత్రి భార్య తో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయిన సోమేలు... 👉మరల ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా తలుపు తీసిన భార్య. 👉అంతే కోపం లో ఉన్న భర్త ఇంట్లోకి రాగానే రోకలి బండ తీసుకుని భార్య అశ్విని తలపై గట్టిగా కొట్టడం తో.... 👉అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయిన అశ్విని. 👉ఈ దారుణ హత్యకు కారణం అక్రమ సంబంధమే కారణం అని..... 👉పోలీస్ స్టేషన్లో ఫోటో లతో సహా చూపించి లొంగిపోయిన భర్త.