టాప్ టెన్ న్యూస్...

1. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం అరెస్టు

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరాన్ని బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన చేసుకున్న విజ్ఞప్తిని మంగళవారం దిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మొదలైన హైడ్రామా ఎన్నో మలుపులు తిరిగింది. హైకోర్టు తీర్పుపై స్టే కోసం వేసిన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐకి స్వేచ్ఛ లభించింది. 

2. 20 రోజులు.. 850 టీఎంసీలు

ఎగువ నుంచి వరద తగ్గడంతో జూరాల, శ్రీశైలం గేట్లు మూత పడ్డాయి. జులై 31న జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా, ఆగస్టు తొమ్మిదిన శ్రీశైలం గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో ఈ రెండు ప్రాజెక్టుల నుంచి గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేసి విద్యుదుత్పత్తి ద్వారానే బుధవారం దిగువకు వదిలారు. ఇరవై రోజుల్లో శ్రీశైలంలోకి 850 టీఎంసీలు వచ్చాయి. ఆగస్టులో ఇంత అత్యధిక ప్రవాహం రావడం జలాశయం చరిత్రలో ఇది రెండోసారి. 1967-68 నుంచి శ్రీశైలం వద్ద నెలల వారీగా వచ్చిన ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2006-07 సంవత్సరం ఆగస్టు నెలలో 1054 టీఎంసీల నీరు వచ్చింది. 

3. ఉత్తుత్తి బీపీ!

బీపీ... ఓ చిత్రమైన సమస్య... కొందరిలో అధిక రక్తపోటు ఉండదు... కానీ ఆసుపత్రిలో వైద్యుడు పరీక్షిస్తున్నప్పుడు మాత్రం అది అమాంతం పెరిగిపోతుంటుంది. ఈ రకం రక్తపోటును ‘వైట్‌కోట్‌ హైపర్‌ టెన్షన్‌’ అంటారు. తెలంగాణలో ఈ తరహా సమస్య ఉన్నవారు 36 శాతం వరకూ ఉన్నట్లు తాజా అధ్యయనం ఒకటి గుర్తించింది. మరోవైపు రాష్ట్రంలో అధిక రక్తపోటు సమస్య యువతలోనూ ఎక్కువగానే ఉంది. అయినా బాధితుల్లో చాలామందికి తమకు బీపీ ఉన్నట్లే తెలియకపోవడం గమనార్హం.

4. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై అపరాధ రుసుముల మోత

నిబంధనలను అతిక్రమించిన వాహనదారుల జేబులు ఇక ఖాళీనే. ప్రస్తుతం వసూలు చేస్తున్న అపరాధ రుసుములను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. మోటారు వాహన నిబంధనల సవరణ చట్టానికి రాష్ట్రపతి ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. ఆ చట్టం ప్రకారం రవాణా నిబంధనలు కఠినతరమయ్యాయి. డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, రహదారి భద్రతా నిధి, ప్రైవేటు క్యాబ్‌ వ్యవస్థల స్థిరీకరణ, రవాణా వ్యవస్థలో సంస్కరణలు తదితర అంశాలను దశలవారీగా అమలులోకి తీసుకురానుంది.

5. పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా శిల్పకళావేదికలో చిరంజీవి జన్మదిన వేడుకలు.

6. మీరు సరేనంటేనే మీ ఖాతాలోకి సొమ్ము!

ఎవరి బ్యాంకు ఖాతాలోకైనా ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేయాలన్నా, నేరుగా సొమ్ము జమ చేయాలన్నా ఇకపై సంబంధిత ఖాతాదారు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నోట్ల రద్దు సమయంలో చాలా మంది ఖాతాదార్లకు తెలియకుండానే వారి జన్‌ధన్‌ ఖాతాల్లో కొందరు తమ అక్రమ సంపాదనను బదిలీ చేయడంతో అలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు ఈ నిబంధన తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని రిజర్వు బ్యాంకును కోరింది.

7. ఇక స్వచ్ఛ ఎవరెస్ట్‌

ఎవరెస్ట్‌! ఈ పర్వతారోహణ కొందరికి సాహసం. మరికొందరికి జీవితాశయం. అయితే ఏటా వేల మంది పర్యాటకులు, సందర్శకులు పారేసే ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలు, కవర్లు, ఇతరత్రా వస్తువులతో ఈ ప్రాంతం ప్లాస్టిక్‌ దిబ్బగా మారుతోంది. దీంతో నేపాల్‌ సర్కారు ‘స్వచ్ఛ’ నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను ఎవరెస్ట్‌ ప్రాంతంలో నిషేధించింది. వచ్చే జనవరి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలని భారతీయ రైల్వే కూడా నిర్ణయించింది. గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2 నుంచి దీన్ని అమలులోకి తీసుకురానుంది. 

8. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ సమాచారమిస్తే సెబీ రూ. కోటి నజరానా!

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తున్నట్లుగా సమాచారమిస్తే రూ.కోటి వరకు నజరానా ఇవ్వనున్నట్లు సెబీ బుధవారం వెల్లడించింది. షేరును ప్రభావితం చేసే అప్రకటిత సమాచారం ఆధారంగా కొందరు మాత్రమే ట్రేడింగ్‌ చేయడాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌గా వ్యవహరిస్తారు. ఎవరైనా ఈ కార్యకలాపాలకు పాల్పడుతుంటే వారి వివరాలను గోప్యంగా హాట్‌లైన్‌ ద్వారా సమాచారం చేరవేసేందుకు సెబీ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబందించి మార్గదర్శకాలకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. 

9. నేటి నుంచే తొలి టెస్టు

టీ20ల్లో అదరగొట్టింది. వన్డేల్లో దుమ్ము రేపింది. ఇప్పుడు అదే జోరుతో టెస్టు సమరానికి సిద్ధమైపోయింది టీమ్‌ఇండియా. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య వెస్టిండీస్‌తో తొలి టెస్టు నేటి నుంచే. కోహ్లీసేనే ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ ఇండియా ఆడనున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఇదే.

10. ఉత్తర్‌ప్రదేశ్‌లో ర్యాగింగ్ భూతం ..

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..