ఐదేళ్ల క్రితం రాజధాని వస్తుందనే ఊహాగానాలు

ఐదేళ్ల క్రితం రాజధాని వస్తుందనే ఊహాగానాలతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన దొనకొండ మరోసారి చర్చనీయాంశమవుతోంది. అమరావతి రాజధానికి అనుకూలంగా లేదని, వరద సమస్య ఎదురవుతుందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే. అమరావతిలో రాజధాని కొనసాగించడానికి, అక్కడ తదుపరి నిర్మాణాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదనే వార్తలొస్తున్నాయి. దీంతో రాజధాని ఎక్కడ అన్న చర్చలు సాగుతోన్న తరుణంలో అందరికీ దొనకొండ గుర్తుకు వస్తోంది. ఆ ప్రాంతంలోని భూములపై బడాబాబుల కన్ను పడింది. సందడి మొదలైంది. ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ వస్తుందని పరిశీలకులంటున్నారు.
రాజధాని విషయంలో వైసిపి గతంలోనూ దొనకొండపట్ల మొగ్గుగా వుండేది. కాని 2014 ఎన్నికల అనంతరం చంద్రబాబు ఎంపిక చేసిన అమరావతికి అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఐదేళ్లు తిరిగేసరికల్లా అధికారం వారికొచ్చాక వరదల నేపథ్యంలో రాజధానిపై మళ్లీ చర్చ లేవనెత్తారు. అమరావతిలో ఇప్పటికే జరిగిన నిర్మాణాలను వదిలేసి ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక రాజధానే ఏకంగా మారుతుందా?అనేది చర్చగా మారింది. వైసిపి వర్గాలు మాత్రం రాజధాని దొనకొండ కాబోతోందని చెబుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగాక ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటి కూడా ఇక్కడే రాజధానికి అనుకూలమని పేర్కొన్న విషయాన్ని వారు గర్తు చేస్తున్నారు. అధికారం లేనందున అనుకున్నది ఆనాడు చేయలేకపోయారు. ఇపుడు అవకాశం వచ్చింది కాబట్టి అందుకు ప్రయత్నిస్తున్నారని కొందరంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై ఏం నిర్ణయం తీసుకుంటుందో కానీ ఇప్పుడు మాత్రం దొనకొండపైనే చర్చ సాగుతోంది. గతంలోనే ఇక్కడ రాజధాని వస్తుందనే భావనతో కొందరు పెద్దలు భూములు కొన్నారు. ఆనాడు ఎకరం రెండు లక్షలున్న భూమి ఒక దశలో రూ.25లక్షలు..రోడ్డు సమీపంలో ఉండేవి రూ.40లక్షలకు కొన్నారు. రాజధాని ఎక్కడ పెడతారనేది తేలని సమయంలో ఈ ధరలు పలికాయి. అమరావతి నిర్ణయించాక ధరలు పడిపోయాయి. గత ప్రభుత్వం ఇక్కడ పారిశ్రామిక వాడను ప్రకటించింది. అయినా భూముల ధరలు పెరగలేదు. ఇక్కడ భూములు కొన్నవారిలో కొద్దిమంది ఏం చేయాలో తెలియక వదిలేశారు. కొందరు వైసిపి నేతలు, ఆ పార్టీ అనుయాయులు ఎక్కువ భూములు కొన్నారనే చర్చ కూడా ఉంది. అయితే రిజిస్ట్రేషన్లు పెద్దగా జరగలేదు. రాజధాని ప్రకటించక ముందు అడ్వాన్సులు ఇచ్చి వదిలేసుకున్నవారూ ఉన్నారు. 
అమరావతిపై తాజాగా నీలినీడలు అలుము కోవడంతో దొనకొండలో భూములపై మళ్లీ పెద్దలు కన్నేశారు. అక్కడ సందడి మొదలైంది. రైతులతో సంప్రదింపులు సాగిస్తున్నారు. మళ్లీ భూముల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఇక రాజధాని మార్పు జరుగుతుందా?అనే ప్రశ్నలకు వైసిపి ఎమ్మెల్యేలు సిఎం జగన్‌ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని సమాధానం చెబుతున్నారు. అయితే కొందరు అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వారి అనుయా యులు ఆయా గ్రామాల్లోని పెద్దలకు ఫోన్లు చేసి భూముల గురించి వాకబు చేస్తున్నారు. గతంలో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోనివారు ఆయా భూ యజమా నులతో మాట్లాడడం మొదలుపెట్టారు. అమరావతి సంగతి ఎలావున్నా దొనకొండ ప్రాంతంలో మాత్రం భూముల ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..