మాజీ ఎంపీ భాజపాలో చేరారు.

దిల్లీ:

పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ భాజపాలో చేరారు. ఇవాళ దిల్లీలో భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో వివేక్‌ భేటీ అయ్యారు. తనతోపాటు మేధావులు, పలువురు నేతలు భాజపాలోకి వస్తారని భాజపా అధిష్ఠానానికి వివేక్‌ తెలిపినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్న కమలదళం.. దళిత, గిరిజన సామాజిక వర్గాల్లో బలమైన నేతలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే గిరిజన సామాజికవర్గానికి చెందిన ఓ మాజీ ఎంపీతోనూ సంప్రదింపులు జరిపింది. ఇది కొలిక్కి రాలేదని సమాచారం. మరోవైపు తెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని భాజపా నేత ఒకరు తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది