నవయుగకు బందరు పోర్టు నిర్మాణ బాధ్యతలు రద్దు
మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి అంశంలో గత ప్రభుత్వంలో జరిగిన కాంట్రాక్ట్ ఒప్పందాలను రద్దు చేస్తూ జీవో నెం 02ను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
పోర్ట్ డవలప్మెంట్ విషయంలో గతంలో చేసిన అన్ని కాంట్రాక్ట్ ఒప్పందాలు రద్దు
బందరు పోర్టు నిర్మాణం అభివృద్ధి కోసం 2010 జూన్ ఏడో తేదీన అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసిన సర్కార్
డెవలపరుకు ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్టు జీవోలో వెల్లడి
బందరు పోర్టు నిర్మాణానికి కొత్త ఒప్పందం చేసుకోనున్న ఏపీ సర్కార్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలతోనే బందరు పోర్టు నిర్మాణం చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం
విశాఖ పోర్ట్ ట్రస్టు ద్వారా బందరు పోర్టు నిర్మాణం నిర్వాహాణ చేపట్టాలని భావిస్తోన్న సర్కార్
ప్రభుత్వ-ప్రభుత్వ రంగ సంస్ధలతో కన్సార్షియం ఏర్పాటుకు కసరత్తు చేస్తోన్న జగన్ సర్కార్
Comments
Post a Comment