నేడు విజయవాడ నగరంలోని హోటల్‌ తాజ్‌ గేట్‌వేలో ఉదయం 10గంటలకు డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు ప్రారంభం కానున్నది.

విజయవాడ: 

నేడు విజయవాడ నగరంలోని హోటల్‌ తాజ్‌ గేట్‌వేలో ఉదయం 10గంటలకు డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు ప్రారంభం కానున్నది.

ఈ సదస్సులో  పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కీలక ఉపన్యాసం చేస్తారు. 

ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభ ఉపన్యాసం.. అనంతరం రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగిస్తారు.

అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. నవరత్నాలు, పెట్టుబడులు, టూరిజం, హెల్త్‌ సెక్టార్‌ వంటి కీలక అంశాలపై ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

మధ్యాహ‍్నం భోజన విరామం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు రాయబారులు, కాన్సులేట్‌ జనరల్‌లతో ముఖాముఖి నిర్వహిస్తారు.

కాగా ఈ సదస్సులో యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమీషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది