మధ్యమానేరు ప్రాజెక్టు  18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ప్రాజెక్టు  18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.  దిగువ మానేరుకు 30 వేల క్యూసెక్కులను అధికారులు విడుదల చేశారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయడంతో.. వరద ఉద్ధృతిలో 1000 గొర్రెలు, మేకలు గల్లంతయ్యాయి. 13 మంది గొర్రెల కాపర్లు కూడా వరద ఉద్ధృతిలో చిక్కుకున్నారు. పలు ద్విచక్రవాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. అయితే పలువురు  కాపర్లు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకుచేరుకున్నారు. ఈ ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మిగతావారిని కూడా రక్షించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..