*👉మూడురోజుల పాటు కోస్తాలో వర్షాలు*

👉 : ఒడిశా, దాని పరిసరాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

👉మరోవైపు సెప్టెంబరు రెండో తేదీకి ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం అభివృద్ధి చెందుతుందని ఐఎండి పేర్కొంది.

👉వీటి ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

👉 రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. ఇటీవల చైనా సముద్రంలో మూడు తుపాన్లు ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు అటువైపునకు వెళ్లిపోయాయని, దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా పెద్దగా ప్రభావం చూపలేదని వాతావరణ శాస్త్రజ్ఞులు రాళ్లపల్లి మురళీకృష్ణ వివరించారు.

👉ప్రస్తుతం నైరుతి పవనాలు మలేసియాపై ఉన్నాయన్నారు. అవి వెనక్కు వస్తేనే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

👉రెండో తేదీన ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే బీహార్‌, బెంగాల్‌, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని, ఎపిలో మోస్తరు జల్లులకే పరిమితమవుతాయని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?