హుండీ ద్వారా రూ.9.90 కోట్ల కానుకలు

కాంచీపురం: 

అత్తివరదర్ ఉత్సవాల సందర్భంగా కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌కు హుండీ ద్వారా రూ.9.90 కోట్ల కానుకలు వచ్చాయి. గత నెల ఒకటో తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 17తో ముగిశాయి. స్వామికి భక్తులు చెల్లించే కానుకల కోసం ఆలయ ప్రాంగణంలో మొత్తం 18 హుండీలను ఏర్పాటు చేశారు. తాజాగా వీటిని లెక్కించగా రూ.9.90 కోట్ల నగదు, 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్టు కలెక్టర్ పొన్నయ్య తెలిపారు. ఇప్పటి వరకు 13 హుండీలను మాత్రమే లెక్కించామని, త్వరలోనే మిగతా హుండీలను కూడా లెక్కిస్తామని కలెక్టర్ తెలిపారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?