మద్యం మత్తులో ఘర్షణ. బీర్ బాటిళ్లతో కొట్టుకున్న ఇరు వర్గాలు.

హైదరాబాద్:- 

దావత్‌లో చెలరేగిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారి తీసింది. రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట్ పొచ్చమ్మ దేవాలయం దగ్గర మంచిరేవుల, కొల్లూరుకు చెందిన కొందరు వ్యక్తులు దావత్ చేసుకుంటుండగా మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు బీర్ బాటిల్‌తో కొట్టుకోవడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?