కావాలనే పాక్ అలా చేస్తుంది ...

ఢిల్లీ:

దౌత్య సంబంధాల‌ను బ‌ల‌హీన‌ప‌రుచుకోరాదంటూ పాకిస్థాన్‌ను భార‌త్ కోరింది.

క‌శ్మీర్‌కు సంబంధించిన ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయ‌డంతో పాక్ చ‌ర్య‌ల‌కు దిగింది.

భార‌త్‌తో వాణిజ్యాన్ని ర‌ద్దు చేసింది. భార‌త రాయ‌బారిపై వేటు వేసింది.

దీంతో భార‌త్ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. దౌత్య సంబంధాల అంశంపై పాకిస్థాన్ త‌న నిర్ణ‌యాన్ని పున‌ర్ స‌మీక్షించుకోవాల‌ని భార‌త్ కోరింది.

ప్ర‌పంచ‌దేశాల ముందు త‌మ సంబంధాలు బ‌ల‌హీనంగా ఉన్నాయ‌ని చెప్ప‌డానికి పాక్ ఈ చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని భార‌త్ అభిప్రాయ‌ప‌డింది.

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనేది పూర్తిగా భార‌త్ నిర్ణ‌య‌మ‌ని కేంద్రం త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

జ‌మ్మూకశ్మీర్ అభివృద్ధి కోస‌మే తాము ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది