అప్పటి వరకు పాత నిబంధనలే అమలు

అప్పటి వరకు పాత నిబంధనలే అమలు, ప్రభుత్వం జరిమానాలు నిర్ణయించాలి, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయకుమార్.

హైదరాబాద్:- రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాకే కొత్త వాహనాల చట్టం అమలు చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎ స్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త మోటార్ వాహనాల చట్టం సెప్టెంబర్ 1వ తేదీ నుంచే అమలు చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటిలో మార్పులు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్ణయించిన జరిమానాలు అమలు చేస్తుందా లేదా తగ్గిస్తుందా అనేది జిఓ జారీ చేయాలని అన్నారు.

ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల్లో వాహనదారులు కోర్టులకు వెళ్లకుండా జరిమానా చెల్లించే విధంగా చేసేందుకు ప్రభుత్వం మార్పులు తెస్తున్నారని అన్నారు. హెల్మెట్ కేసుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకుండా వాహనదారులే జరిమానా కట్టేవిధంగా చూస్తున్నామని ఈ విధంగానే చేసేందుకు మా ర్పులు తీసుకువచ్చేందుకు చూస్తున్నామని తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్‌లేని కేసుల్లో మాత్రమే చార్జిషీట్ వేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చాకనే కొత్త ట్రాఫిక్ నియమా లు అమలులోకి వస్తాయని, అప్పటి వరకు పాత ట్రాఫిక్ నిబంధనలుఅమలులో ఉంటాయని స్పష్టం చేశారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..