నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 24 గంటలపాటు భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ బుధవారం హెచ్చరించింది.

తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, యానాం, పుదుచ్చేరి, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

బిహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

అరేబియా, బంగాళాఖాతం తీరప్రాంతాల్లో గాలి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నందు వల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..