డల్లాస్‌ వేదికపై ప్రవాసాంధ్రులనుద్దేశించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రసంగం

ఆగస్టు 17
డల్లాస్, యూఎస్‌ఏ

ముఖ్యమైన పాయింట్లు

‘‘ఐ హేవ్‌ ఎ డ్రీం’’
డల్లాస్‌ వేదికపై ముఖ్యమంత్రి శ్రీ  వైయస్‌. జగన్‌ విజన్‌
నాన్నగారిని, నన్ను, నా కుటుంబాన్ని అమితంగా ప్రేమించే హృదయాలకు ప్రేమాభివందనాలు
మొన్నటి ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పోషించిన పాత్ర చాలా గొప్పది
చరిత్రాత్మక విజయం వెనుక మీ కృషి ఉంది
మీ ప్రేమకు సెల్యూట్‌ చేస్తున్నాను
అమెరికన్లను మించి తెలుగువారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణం
అమెరికా అభివృద్ధి వెనుక తెలుగువారి కృషి ఉందని స్వయంగా అమెరికా అధ్యక్షుడే చెప్పారు
మీ ప్రతిభను చూసి ముచ్చటేస్తోంది, మాతృభూమి మీరు గౌరవిస్తున్న తీరు గర్వకారణం
ఇంకెక్కడా  ఇలాంటి ప్రేమాభిమానాలను చూడలేం
తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మక చర్యలు
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి మనిషి,  ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గ గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు
వైయస్సార్‌ తనయుడిగా, 3648 కిలోమీటర్ల మేర పాదయాత్రచేసిన నాయకుడిగా నాకు నాకు కొన్ని లక్ష్యాలు
అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మించాలన్నది నాకు ఒక డ్రీం
అన్నం పెడుతున్న రైతులకు అన్నం దొరక్క అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకూడదన్నది నా కొక డ్రీం
రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదన్నది నా డ్రీం
పల్లెలు కళ, కళ లాడాలని, అక్కడి ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలన్నది నొదొక డ్రీం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలన్ని నాదొక డ్రీం.
పేదవాడు అయినా వైద్యం ఖర్చు భరించలేక, చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదన్నది నాదొక డ్రీం
సొంత ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నది నా డ్రీం
పేదరికం వల్ల తన బిడ్డలకు చదివించలేని పరిస్థితి ఏ తల్లికీ  ఉండకూడదన్నది నా డ్రీం
ఏ ఒక్కరూ నిరుద్యోగంతో పస్తులు ఉండకూడదన్నది ఒక డ్రీం
ఏ ఒక్క కుటుంబం మద్యం కారణంగా విచ్ఛిన్నం కావడానికి వీల్లేదన్నది నాదొక డ్రీం
ప్రభుత్వ సేవలన్నీకూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ అందుబాటులోకి రావాలన్నదే నాదొక డ్రీం
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ, ప్రతి ఎకరానికీ కాల్వలద్వారా నీళ్లు అందించాలన్నదే నాదొక డ్రీం
కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది నాదొక డ్రీం
రెండున్నర నెలల పరిపాలనలోనే ఏకంగా చరిత్రను మార్చే దిశగా అడుగులు
తొలి అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులను తీసుకు వచ్చాం
రెండన్నర వ్యవధిలోనే గ్రామ వాలంటీర్లను, గ్రామ సెక్రటేరియట్లను తీసుకు వస్తున్నాం
అణగారిన వర్గాలు, ,బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, నామినేటెడ్‌ పదవులు,  నామినేటెడ్‌ పనుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నాం
ఇందులో మహిళలకు సగం రిజర్వేషన్లు ఇచ్చాం
75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడాలేని విధంగా యాక్ట్‌నుకూడా తీసుకొచ్చాం
పారదర్శకత కోసం దేశచరిత్రలోనే మొట్టమొదటి సారిగా జ్యుడిషయల్‌ప్రివ్యూ యాక్ట్‌ను తీసుకు వచ్చాం
బీసీ, ఎస్సీ, ఎసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 60శాతానికిపైగా చోటు ఇచ్చాం, కీలక శాఖలు కట్టబెట్టాం
ఐదుమందిలో నలుగుర్ని డిప్యూటీ సీఎంలుగా చేశాం
దేశమంటే మట్టికాదు, దేశమంటే.. మనుషులే అని నమ్మాం
తెలంగాణ రాష్ట్రంతో సఖ్యత సంబంధాలను కుదుర్చుకుంటున్నాం
సముద్రంలోకి పోతున్న గోదావరి నదీజలాలను ఎండిపోతున్న ప్రాంతాలకు, కృష్ణా ఆయకట్టు ప్రాంతాలకు తీసుకువెళ్తాం
విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం
ప్రతి పాఠశాలనూ ఇంగ్లిషు మీడియం చేస్తున్నాం
మూడేళ్లలో పాఠశాలలు, ఆస్పత్రుల పరిస్థితిని మారుస్తాం, నాడు – నేడు అని ఫొటోలు చూపిస్తాం.
పరిశ్రమలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాం
పీపీఏల సమీక్షద్వారా పరిశ్రమలకు మేలు
నాలుగు పునాదులపై రాష్ట్ర ప్రణాళిక
పారదర్శక, అవినీతి రహిత విధానాలతో పారిశ్రామిక రంగానికి సానుకూల వాతావరణం
పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలను తగ్గించే చర్యలు
మౌలిక సదుపాయాల్లోనూ, పరిశ్రమల్లోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా నిజాయితీతో కూడిన నిర్ణయాలు
పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థ
మన రాష్ట్రానికి, మన అంధ్రప్రదేశ్‌కు మీరు రండి, మిమ్మల్ని అందర్నీ ఆహ్వానిస్తున్నాను
ఇది మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి
మీ కుటుంబాలతో రండి, మన గ్రామాలకు రండి, మీ తల్లిదండ్రులను, మీ అవ్వాతాతల్ని, మీ అన్నదమ్ముల్ని, మీ అక్కచెల్లెల్ని, మీ స్నేహితుల్ని చూడడానికి సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు అయినా రండి
పెట్టుబడులు పెట్టడానికి ముందడుగులు వేస్తూ మీరు రండి
అన్ని రకాలుగా మేం చూసుకుంటాం, మీకు తోడుగా ఉంటాం
గ్రామాల్లో మీరు చదువుకున్న బడులను మార్చాలని ఆరాటం ఉన్నవాళ్లు, మీమీ గ్రామాల్లో మీ వైద్యశాలలు మార్చాలి అని తపన ఉన్నవాళ్లు ముందుకు రండి
మీరు, మనమూ ఇద్దరూ కలిసి మన గ్రామాలను బాగుపరుచుకుందాం
మేం చేస్తున్న ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతు ఇవ్వండి

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..