బాబోయ్ బంగారం.. రికార్డ్ స్థాయికి పెరిగిన ధర

బంగారం ధరలు ఒక్కసారిగా చుక్కల్ని తాకాయి. బులియన్ మార్కెట్లో నిన్న ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగింది. ఈ కారణంగా 10 గ్రాముల పసిడి ధర ఆల్​ టైం రికార్డు స్థాయిల వద్ద రూ.38,770గా నమోదైంది.నగల వ్యాపారుల నుంచి డిమాండు అధికంగా ఉన్న కారణంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయని బులియన్ ట్రేడర్లు అంటున్నారు.


రూపాయి బలహీనతలూ పసిడి పరుగులకు ఊతమందించాయని పేర్కొన్నారు.వెండి మాత్రం కిలోకు రూ.1,100 తగ్గింది. ఫలితంగా కిలో వెండి ధర రూ.43,900లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర స్థిరంగా 1,500 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 16.93 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరతో పోలిస్తే డాలర్‌ బలంగా ఉందని మార్కెట్ వర్గాల సమాచారం


Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..