యురేనియం కార్పొరేషన్ వ్యర్ధాలపై తనిఖీకి ప్రభుత్వ ఆదేశం

క‌డ‌పః 

కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలో యురేనియం కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ వ్యర్ధాలపై ప్రభుత్వం తనిఖీకి ఆదేశించింది.

యురేనియం కార్పొరేషన్ వలన భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం తనిఖీ, అధ్యయనానికి ఆదేశించింది.

ఏపీ కాలుష్య నియంత్రణ మండలి దీనిపై ప్రభుత్వ నిపుణుల కమిటీని నియమించింది.

వ్యర్ధాలు నిల్వచేస్తున్న పాండ్, పరిసరాలలో భూగర్భ జలాల కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలపై అధ్యయనం చేసి కలుషితం అవుతున్నాయా లేదా అన్నది తేల్చాలని నియంత్రణ మండలి ఆదేశించింది.

కమిటీలో సభ్యులుగా ఎన్జీఆర్ఐ, జియాలజీ, భూగర్భ జల విభాగం, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఏపీ గనులు, వ్యవసాయ శాఖ, తిరుపతి ఐఐటీ నుండి నిపుణులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..