బైక్ లేనిదే బయటకు రావట్లేదు... హైదరాబాద్ లో 50 లక్షల టూ వీలర్స్

హైదరాబాద్ : భాగ్య నగర వాసులు కాలుతీసి బయట పెడితే బైక్ నే ఉపయోగిస్తున్నట్లు తాజా లెక్కలు చెపుతున్నాయి. నగరంలో ఎంత రద్దీ ఉన్నా బైక్ మీద దూసుకుపోవచ్చని సగటు నగరజీవి ఆలోచన. అందుకే నగరంలో దాదాపు సగం మంది ద్విచక్ర వాహనాలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం వివిధ రవాణా సదుపాయాలు వినియోగిస్తున్న వారిపై ఆస్కి సంస్ధ అధ్యయనం చేసింది.

నగరంలో 48 శాతం మంది బైక్ లు మరో 2 శాతం మంది కార్లు వినియోగిస్తున్నట్లు తేలింది. ఇక మెట్రో ప్రయాణికులు 2 శాతం ఉంది. 1988 లో నగరంలో బస్సులో ప్రయాణించే వారు 64 శాతం ఉండగా నేడు వారి శాతం 33 కి పడిపోయింది. 1988 లో వ్యక్తిగత వాహానాలు వినియోగం 28 శాతం ఉండగా ఇప్పుడు అది 50 శాతానికి పెరిగింది.

పెరుగుతున్న బైక్ ల సంఖ్య
నగరంలో ప్రస్తుతం ఉన్నబైక్ ల సంఖ్య సుమారు 42 లక్షలుగా ఉంది. రోజుకు 600-900 మధ్య ద్విచ్రక వాహానాలు అమ్మాకాలు జరిగి వీటిలో కొత్తగా చేరుతున్నాయి. దీంతోనగరంలో ట్రాఫిక్ రద్దీ పెరగి పోతోంది. నగరంలోని 9 వేల కిలోమీటర్లు రహదారులు ఈ అరకోటి వాహనాలకు ఏ మాత్రం సరిపోవటం లేదు. దీంతో వాహాన వేగం గంటకు 18 కేఎంపీహెచ్ కు పడి పోయింది. నిత్యం ద్విచక్రవాహాన దారులు 2 గంటలపాటు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని గంట నుంచి రెండు గంటలపాటు విలువైన సమయా్ని కోల్పోతున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..