ఈడీ ఉచ్చులో ఎంఎన్ఎస్ అధినేత...ముంబైలో 144 సెక్షన్

ముంబై:

ముంబైలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. మరికాసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అధికారులు మహారాష్ట్ర నవనిర్మాణసేన పార్టీ అధినేత రాజ్‌థాక్రేను ప్రశ్నించనున్న నేపథ్యంలో అక్కడికి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

అయితే ముంబై పోలీసులు పరిసరప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు.

ఇప్పటికే సంయమనం పాటించాలని రాజ్‌థాక్రే పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు.

అయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబైలోని ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు చెప్పారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?