డ్యూటీలో ఉన్న హోంగార్డ్ ఏఎస్సై పై రౌడీ షీటర్ దాడి

హైదరాబాద్:

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నైట్ డ్యూటీలో ఉన్న హోంగార్డ్ సతీష్, ఏఎస్సై గోపాల్‌రావుపై రౌడీ షీటర్ గణేష్ దాడి చేశాడు. స్థానిక బల్కంపేట్‌లోని సరోవర్ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లిన నైట్ డ్యూటీ పోలీసులపై రౌడీ షీటర్ దాడి చేశాడు. ఈ దాడిలో సతీష్, గోపాల్‌రావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం రౌడీ షీటర్ గణేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?