దేశ చరిత్రలో మొదటి సారి

దేశ చరిత్రలో మొదటి సారి కేంద్ర మాజీ హోం మంత్రి అరెస్టు, చిదంబరం రికార్డు, ఆ రోజు రారాజు !

న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారి కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి అరెస్టు అయ్యారు. ఇంత వరకు ఏ కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి అరెస్టు కాలేదు. మొదటి సారి కేంద్ర మాజీ హోం మంత్రి పి. చిదంబరం అరెస్టు అయ్యారు. ఇంత వరకు కేంద్ర మాజీ మంత్రిని పోలీసులు కానీ, సీబీఐ కానీ అరెస్టు చెయ్యలేదు. యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ తరువాత అన్నీ తానై చూసుకుని ఓ వెలుగు వెలిగిన పి. చిదంబరంకు సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.

చక్రం తిప్పిన చిదంబరం

మన్మోన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వంలో పి. చిదంబరం ఓ వెలుగు వెలిగారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిగా, కేంద్ర హోం శాఖా మంత్రిగా పి. చిదంబరం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్ర హోం శాఖా మంత్రిగా ఉన్న సమయంలో పి. చిదంబరం ఢిల్లీ పోలీసులు, సీబీఐని తన గుప్పిట్లో పెట్టుకున్నారని అప్పట్లో బీజేపీ ఆరోపించింది.

ఆ రోజు సీబీఐ ఆఫీస్ లో రారాజు, ఈ రోజు !

కేంద్ర హోం శాఖా మంత్రిగా పి. చిదంబరం పని చేసిన సమయంలో ఆయనకు సీబీఐ అధికారులు సలామ్ కొట్టారు. అయితే ఇప్పుడు అదే సీబీఐ అధికారులు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంను అరెస్టు చేశారు. ఆ రోజు సీబీఐ కార్యాలయంలో రారాజుగా కుర్చున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోపిగా అదే కార్యాలయంలో కుర్చున్నారు. ఇప్పుడు ఈడీ అధికారులు చిదంబరం వెంట పడటానికి సిద్దంగా ఉన్నారు.

ద్వేష రాజకీయాలు ?

చిదంబరం కేంద్ర హోం శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ద్వేష రాజకీయాలకు పాల్పడ్డారని బీజేపీ నాయకులు అప్పట్లో ఆరోపించారు. గుజరాత్ హోం మంత్రిగా ఉన్న అమిత్ షాను సోహ్రోబుద్దీన్ షేక్ అనే నేరస్తుడి నకిలి ఎన్ కౌంటర్ కేసులో అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో అమిత్ షా మీద హత్య, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, కేంద్ర హోం శాఖా మంత్రి పి. చిదంబరం ద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారని అప్పట్లో బీజేపీ దుమ్మెత్తిపోసింది.

మోడీ మీద ఒత్తిడి చేసిన చిదంబరం !

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగాయి. ఆ సందర్బంలో కేంద్ర హోం శాఖా మంత్రిగా ఉన్న పి. చిదంబరం గుజరాత్ అల్లర్ల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుని దర్యాప్తు విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మీద, సీబీఐ అధికారుల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చెయ్యడం కొసమొరుపు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..