గ్రామ సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల రాత పరీక్షలు 9 జిల్లాల్లో నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది

అమరావతి:

రాష్ట్రంలో గ్రామ సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల రాత పరీక్షలు 9 జిల్లాల్లో నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు 1 నుంచి 8 వరకు నిర్వహించనున్న సచివాలయ రాత పరీక్షలకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల రాత పరీక్షలు రాసే అభ్యర్థులకు నిరాశ మిగిల్చింది. నెల్లూరు, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఈ పరీక్షలు నిలిపేయాలని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో సైట్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్న సిబ్బంది మొదట హైకోర్టును ఆశ్రయించి తమను రెగ్యులర్‌ చేసే అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని రెండు వారాల్లోపు పరిష్కరించి, వాటి నియామకాల కోసం నిర్వహిస్తున్న రాత పరీక్షలను నిలిపేయాలని ఆదేశించింది. ఆ తర్వాత మరో 8 జిల్లాల్లోను ఇదే తరహా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. సర్వేయర్ల పోస్టులకు సంబంధించి కూడా వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్టే ఉత్తర్వులిచ్చింది. దీంతో పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో పాటు ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు లీగల్‌ విభాగం అధికారులతో చర్చిస్తున్నారు. వచ్చే నెల 7న ఈ పరీక్ష నిర్వహించనున్నందున హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లి సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను నిలిపివేయించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తీర్పు అనుకూలంగా వస్తే పరీక్షలు జరుగుతాయి. లేకుంటే ఆ 9 జిల్లాల్లో ఆగిపోవచ్చని అధికారులు అంచనా

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..