బ్యాంకు ఉద్యోగులు ఆందోళన

ఢిల్లీ:

బ్యాంకుల విలీనంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు.

శనివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల ముందు ఆందోళన చేపట్టనున్నట్లు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ) జనరల్ సెక్రటరీ దేబాసిస్ బసు చౌదరీ తెలిపారు.

ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేయనున్నదని, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన హెచ్చరించారు.

ఈ ఆందోళనలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది యూనియన్లకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొననున్నారని చెప్పారు.

గతం లో విలీనం చేయడంతో ఎన్నో శాఖలు మూతపడ్డాయని, భారీగా ఉద్యోగాలు కోల్పోయారని ఆయన విమర్శించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..