ఓ బాలికపై అత్యాచారం

లక్నో :

ఓ బాలికపై అత్యాచారం జరిపిన కేసులో పోస్కో ప్రత్యేక కోర్టు విచారణను కేవలం 9 రోజుల్లోనే ముగించి సంచలన తీర్పు వెలువరించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో వెలుగుచూసింది. ఔరాయియా పట్టణానికి చెందిన నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆగస్టు నెల 1వతేదీన కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని 2వతేదీన అరెస్టు చేశారు. యూపీ డీజీపీ ఓపీ సింగ్ ఆదేశంతో ఈ కేసులో ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ నెల 18వతేదీన పోస్కో ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీంతో ఈ కేసు దర్యాప్తును కేవలం 9 రోజుల్లో ముగించిన కోర్టు జడ్జి దోషికి జీవిత ఖైదు విధించారు. దీంతోపాటు రెండులక్షల రూపాయల జరిమానా విధించి, ఆ మొత్తాన్ని బాలిక కుటుంబానికి అందించాలని ఆదేశించారు. ఈ కేసు తీవ్రత దృష్య్టా కేవలం 9 రోజుల్లోనే విచారణ ముగించి ఆగస్టు 29వతేదీన తీర్పు వెలువరించారు.ఇలా ఇంత తక్కువ సమయంలో తీర్పు చెప్పిన ఘటన దేశంలోనే మొట్టమొదటి సారి అని పోలీసులు చెప్పారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..