న్యూఢిల్లీ:- నగరంలోని జిల్‌మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రబ్బరు ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే స్థానిక దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది...