Posts

Showing posts with the label జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరలో ఉగ్రదాడికి అవకాశం
Image
శ్రీనగర్ జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరలో ఉగ్రదాడికి అవకాశం ఉందని పాకిస్థాన్​ నిఘా వర్గాలు భారత్​ను అప్రమత్తం చేశాయి. స్పందించిన ప్రభుత్వం కశ్మీర్​వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. బిష్కెక్​లో షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ముందు ఈ నిఘా సమాచారాన్ని పాక్​ అందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికాకూ తెలిపింది పాకిస్థాన్​ పుల్వామాలో పాక్​ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది భారత సీఆర్​పీఎఫ్​ జవాన్లు అమరులయ్యారు. అదే రీతిలో అవంతిపొరలో దాడికి యత్నించవచ్చని పాక్​ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత నెల 24న పుల్వామా జిల్లాలో ఆల్​ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాద ముఠా అన్సార్ గజావత్​ ఉల్​ హింద్ కమాండర్​ జకీర్​ మూసాను భద్రతా దళాలు కాల్చిచంపాయి. ఇందుకు ప్రతీకారంగా విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నాయన్నది పాక్ నిఘా వర్గాల సమాచారం. అయితే దాడికి సంబంధించి కచ్చితమైన వివరాలు పాక్ ఇవ్వలేదని అధికారులు తెలిపారు.