Posts

Showing posts with the label చంద్రయాన్-2 అంటే..
Image
చంద్రయాన్-2 అంటే.. చంద్రయాన్-2 చాలా ప్రత్యేకమైన ఉపగ్రహం. ఇందులో ఒక ఆర్బిటర్, 'విక్రమ్' అనే లాడర్, 'ప్రజ్ఞాన్' అనే రోవర్ ఉంటాయి. దీని ద్వారా భారత్ చంద్రుడి ఉపరితలంపై మొదటిసారి 'సాఫ్ట్ ల్యాండింగ్' చేయబోతోంది. ఇది చాలా క్లిష్టమైనది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 600 కోట్ల రూపాయలకు పైనే అని చెబుతున్నారు. 3.8 టన్నుల చంద్రయాన్-2ను జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. భారత్ తన ఉపగ్రహం ముద్రను చంద్రుడిపై వేయడానికి ఇది చాలా కీలకమైన మిషన్. ఈ మిషన్ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఇస్రో చెబుతోంది. ఇంతకు ముందు జరిగిన చంద్రయాన్-1 మిషన్ రెండేళ్లు జరగాలి. కానీ అందులో లోపాలు తలెత్తడంతో అది ఏడాదిలోనే ముగిసింది. దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నామని, చంద్రయాన్-2లో ఆ లోపాలు సరిదిద్దామని ఇస్రో చెబుతోంది.