చంద్రయాన్-2 అంటే..

చంద్రయాన్-2 చాలా ప్రత్యేకమైన ఉపగ్రహం. ఇందులో ఒక ఆర్బిటర్, 'విక్రమ్' అనే లాడర్, 'ప్రజ్ఞాన్' అనే రోవర్ ఉంటాయి.

దీని ద్వారా భారత్ చంద్రుడి ఉపరితలంపై మొదటిసారి 'సాఫ్ట్ ల్యాండింగ్' చేయబోతోంది. ఇది చాలా క్లిష్టమైనది.

ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 600 కోట్ల రూపాయలకు పైనే అని చెబుతున్నారు.

3.8 టన్నుల చంద్రయాన్-2ను జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నారు.

భారత్ తన ఉపగ్రహం ముద్రను చంద్రుడిపై వేయడానికి ఇది చాలా కీలకమైన మిషన్. ఈ మిషన్ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఇస్రో చెబుతోంది.

ఇంతకు ముందు జరిగిన చంద్రయాన్-1 మిషన్ రెండేళ్లు జరగాలి. కానీ అందులో లోపాలు తలెత్తడంతో అది ఏడాదిలోనే ముగిసింది.

దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నామని, చంద్రయాన్-2లో ఆ లోపాలు సరిదిద్దామని ఇస్రో చెబుతోంది.


Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?