చంద్రబాబు నివాసానికి నోటీసులు పంపడంపై యనమల ఆగ్రహం

చంద్రబాబు నివాసానికి నోటీసులు పంపడంపై యనమల ఆగ్రహం
ఇది ముమ్మాటికీ చంద్రబాబుపై కక్ష సాధింపు చర్య: యనమల

ఈ భవనం నిర్మించినప్పడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు

అక్రమంగా కట్టారని భావిస్తే ఆ రోజు వైఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు..?

అక్రమ కట్టడాలకు అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది..?

వైఎస్ పేరుతో ఉన్న పార్టీని కొడుకు జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడు
వైఎస్ బొమ్మ పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు

వైఎస్ కాలంనాటివి అక్రమ కట్టడాలైతే  వాటికి జగన్ బాధ్యత వహించాలి
తండ్రి అనుమతిచ్చిన నిర్మాణాలకు కొడుకు నోటీసులు పంపడమా..?

అవన్నీ అక్రమ నిర్మాణాలైతే బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డే
భవనం నిర్మించే సమయానికి సిఆర్ డిఏ లేదు.

అప్పటికి అమరావతి రాజధాని ప్రతిపాదన లేదు.

ఈ భవనానికి 2008లో గ్రామ పంచాయితీ అనుమతి ఇచ్చింది. రివర్ కన్జర్వేటర్ 2012లో అనుమతి ఇచ్చారు.

చంద్రబాబుపై కక్షతోనే నదికి 130మీ దూరంలో ఉన్న ప్రజావేదికను కూలగొట్టారు.

ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న నివాసానికే ఏకంగా నోటీసులు అంటించారు

ఇది విధ్వంసక ప్రభుత్వంగా మారింది. భవనాలను నేలమట్టం చేస్తోంది,ఇళ్లకు నోటీసులిస్తోంది, పౌరులపై దాడులు చేయిస్తోంది.

రాష్ట్ర అభివృద్దిపై సీఎం జగన్ కు దృష్టి లేదు, పేదల సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి శ్రద్ద లేదు.

కూలగొట్డడం, విధ్వంసం చేయడడం,భయోత్పాతం సృష్టించడమే జగన్ దినచర్య
బెదిరించడం,దాడులు చేయడం,దౌర్జన్యాలు జరిపించడం జగన్ నిత్యకృత్యాలు
చంద్రబాబు నిర్మాణానికి కృషి చేస్తే, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నారు.

ఈ దుందుడుకు చర్యలను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి.

యనమల రామకృష్ణుడు
శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది