పదో తరగ తి పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులను తొలగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

పదో తరగ తి పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులను తొలగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్‌ పరీక్షల్లో 80 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తుండగా మరో 20 మార్కులను ఇంటర్నల్‌ పరీక్షల పేరిట ఉపాధ్యాయులే విద్యార్థులకు వేసే అవకాశాలు విద్యాశాఖ కల్పించింది. ఈ విధానం వల్ల గత పబ్లిక్‌ పరీక్షల్లో పదో తరగతిలో పది జీపీఏ అత్యధిక శాతం విద్యార్థులు సాధించడం విమర్శలకు తావిచ్చింది. దీం తో ప్రభుత్వానికి ఇంటర్నల్‌ మార్కులను రద్దు చేయాలని ప్రతిపాదనలు వచ్చిన గత విద్యా సంవత్సరంలో రద్దు చేయకుండానే ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని అమలు చేశారు. తాజాగా విద్యా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ విద్యా సంవత్సరంలో ప్రతి సబ్జెక్టు 100 మార్కులతో పరీక్షలు జరగనున్నాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..