అమెరికాలోని డాలస్​లో ఓ ప్రైవేటు విమానం కూలి 10 మంది మృతి చెందారు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రాంతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అనంతరం సమీపంలో ఉన్న హాంగర్​(విమానాలు నిలుపు స్థలం)లోని ఈ విమానం దూసుకెళ్లిందని ఫెడరల్ ఏవియేషన్(ఎఫ్​ఏఏ) అధికారులు వెల్లడించారు.

ప్రమాదం కారణంగా ఘటన స్థలంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

మృతుల కుటుంబాలను గుర్తించి వారికి సమాచారం అందించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

విమానంలో ఉన్నవారందరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఎఫ్​ఏఏ దర్యాప్తు ప్రారంభించింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..