ముంబ‌యిలో 24 గంటల్లో మూడంకెల వర్షపాతం!!

ముంబయి :  దేశ వాణిజ్య రాజధాని ముంబ‌యిని కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి.

కేవలం 24 గంటల్లోపే మూడంకెల వర్షపాతం నమోదైనట్టు స్కైమెట్ వెదర్ వాతావరణ సంస్థ శనివారం తెలిపింది.

శుక్రవారం నగరంలో 235మి.మీల వర్షం కురిసింది. గత పదేళ్లలో 24 గంటల్లోనే నమోదైన రెండో అత్యధిక వర్షపాతం ఇది. జూన్ నెలలో ముంబైలో ఇంత భారీ వర్షాలు కురవడం కొత్తేం కాదు.

ఈ నెలలోనే ఇప్పటికి రెండు మూడు సార్లు ముంబైలో కుండపోత వానలు కురిశాయి. 
       
శనివారం కూడా మహారాష్ట్ర రాజధానిలో జోరుగా వానలు కురిశాయి.

దీంతో నగరంలో ఎక్కడ చూసినా మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. ముంబైకి 493మి.మీల నెలవారీ సగటు వర్షపాతం రికార్డు ఉంది.

దానిని ఒక్కరోజులోనే అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నగరంలో 423మి.మీల వర్షపాతం నమోదైంది.

గత రికార్డును దాటేందుకు మరో 70మి.మీల వర్షం కురిస్తే చాలు.

ఇంకా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో ఆ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. 

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..