రోజా కీలక నిర్ణయం... అంతా సీఎం జగన్ చేతుల్లోనే...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన ఎమ్మెల్యే రోజాను వైసీపీ నాయకత్వం ఎలాగోలా బుజ్జగించింది. ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి ఆమెను కూల్ చేసింది. ఇందుకోసం సీఎం జగన్‌తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆమెతో చర్చలు జరిపారు. రెండున్నరేళ్ల తరువాత జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రోజాకు ఛాన్స్ ఉంటుందని... అప్పటివరకు ఆమె కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా కొనసాగుతారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా రోజా గురించి ఓ ఆసక్తికరమైన వార్త రాజకీయవర్గాల్లో హల్ చల్ చేస్తోంది. 

ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రోజా ఇప్పటివరకు ఆమె సొంత నియోజకవర్గమైన నగరికి వెళ్లలేదని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా గెలిచిన తరువాత ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గానికి వెళ్లి అభిమానులను, కార్యకర్తలను పలకరిస్తుంటారు. కానీ రోజా మాత్రం నగిరికి ముఖం చాటేశారని టాక్. మంత్రి పదవి దక్కకపోవడంతోనే ఆమె నియోజకవర్గానికి వెళ్లలేదని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే ఏపీఐఐసీ చైర్మన్ పదవి వచ్చినా... ఆమె ఇంకా నగరి వైపు చూడలేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

దీనికి కూడా ఓ కారణం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాతే నియోజకవర్గానికి వెళ్లాలని రోజా డిసైడయ్యారని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన జీవోను ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదని... అందుకే రోజా ఇంకా ఆ బాధ్యతలు స్వీకరించలేదని తెలుస్తోంది. మొత్తానికి రోజా నగరికి ఎప్పుడు వస్తారనే దానిపై వైసీపీ వర్గాలతో పాటు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి నెలకొన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..