ఓ వైపు ట్రిపుల్‌ తలాక్‌ నేరమంటూ కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికి.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు

లక్నో : ఓ వైపు ట్రిపుల్‌ తలాక్‌ నేరమంటూ కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికి.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా నోయిడాలో మరో ట్రిపుల్‌ తలాక్‌ సంఘటన చేసుకుంది. కూరగాయలు కొనేందుకు 30 రూపాయలు అడిగిందని భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడో ప్రబుద్ధుడు. వివరాలు.. నోయిడాకు చెందిన జైనాబ్‌‌(30) కూరగాయలు కొనడం కోసం భర్తతో పాటు స్థానిక రావోజి మార్కెట్‌కు వెళ్లింది. కురగాయలు కొనే నిమిత్తం రూ. 30 ఇవ్వాల్సిందిగా భర్తను కోరింది. దాంతో ఆగ్రహించిన ఆమె భర్త సబీర్‌(32) స్క్రూడ్రైవర్‌తో జైనాబ్‌ మీద దాడి చేయడమే కాక.. ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు.
ఈ సంఘటన గురించి బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘పెళ్లైన దగ్గర నుంచి సబీర్‌ నా కూతుర్ని హింసిస్తున్నాడు. అతని సోదరులు నా కుమార్తెతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం జైనాబ్‌ మా ఇంటికి వచ్చింది. ఐదు రోజుల తర్వాత తన అత్త వారింటికి వెళ్లింది. వెళ్లిన దగ్గర నుంచి సబీర్‌ తనకు విడాకులు కావాలంటూ నా కుమార్తెను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కూరగాయల కోసం నా కుమార్తె 30 రూపాయలు అడిగింది. దాంతో సబీర్‌ నా కుమార్తెకు తలాక్‌ చెప్పాడ’ని వాపోయాడు. జైనాబ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు సబీర్‌, అతని కుటుంబ సభ్యుల మీద దాద్రీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..