బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వచ్చిన ఆ తెలంగాణ యువకుడు

 బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వచ్చిన ఆ తెలంగాణ యువకుడు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వద్ద డ్రైవర్‌గా పనికి కుదిరాడు. యజమాని కూతురు అతడి ప్రేమలో పడింది. అతడేమో.. ఎందుకు వచ్చిన తిప్పలు అనుకున్నాడో ఏమో ఉద్యోగం వదిలేసి స్వస్థలానికి వెళ్లిపోయాడు. ప్రేయసి ఊరుకోలేదు. తరచూ అతడితో ఫోన్లో మాట్లాడేది. ఒకానొక రోజు కాలేజీ టూర్‌ కోసం ఒమన్‌ వెళుతున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి తెలంగాణ రాష్ట్రంలో వాలిపోయింది. ఇద్దరూ అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఓసారి వచ్చిపోవాలంటూ అత్తగారింటి నుంచి ఫోన్లు వెళ్లడంతో భార్యతో కలిసి సౌదీ వెళ్లాడు. అదే అతడు చేసిన తప్పయింది. ఇక్కడ విమానాశ్రయంలో దిగగానే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌కు చెందిన షేక్‌ అజీమ్‌ (30)కు వచ్చిపడిన కష్టం ఇదీ. రెండు నెలలుగా గల్ఫ్‌లో జైల్లో మగ్గుతున్న తనను విడిపించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు. గల్ఫ్‌ చట్టాల ప్రకారం.. ఇక్కడ పెళ్లిళ్లకు వధువు తండ్రి సమ్మతి తప్పనిసరి. ఇప్పుడిదే అంశం షేక్‌ అజీమ్‌కు సమస్యగా మారింది. సౌదీలో జీజాన్‌ పట్టణంలో షేక్‌ డ్రైవర్‌గా ఓ చోట పనికి కుదిరాడు.

యజమానికి సంబంధించిన వివిధ పనులన్నీ చూసేవాడు, ఈ క్రమంలో షేక్‌ అజీమ్‌ను అతడి యజమాని కూతురు రజ్హా (27) ప్రేమించింది. కొన్నాళ్లకే అజీమ్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. అయినా అతడిపై ప్రేమను చంపుకోని రజ్హా పారిపోయి అజీమ్‌కు వద్దకు వెళ్లిపోయింది. నవీపేటలో ఇస్లామిక్‌ సంప్రదాయం ప్రకారం గత ఏడాది మే 11న వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన రజ్హా తండ్రిఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేయగా, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కేసును వీలయినంత త్వరగా విచారించాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. రజ్హా తండ్రి కూతురు కోసం నిర్మల్‌కు వెళ్లాడు. కాగా తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, ఇష్టపూర్వకంగానే భారత్‌కు వచ్చి షేక్‌ అజీమ్‌ను పెళ్లిచేసుకున్నానని న్యాయస్థానంలో రజ్హా పేర్కొంది. దీంతో చేసేది లేక తండ్రి తిరిగి సౌదీకి తిరిగొచ్చాడు. గర్భం దాల్చిన రజ్హాను ఒకసారి వచ్చి వెళ్ళాలని కుటుంబ సభ్యులు కోరగా రెండు నెలల క్రితం భర్తతో కలిసి సౌదీకి వచ్చింది. దంపతులు విమానాశ్రయంలో దిగిన వెంటనే అజీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రజ్హాను కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారు. తానేమీ తప్పు చేయలేదని.. పూర్తిగా భారత చట్టాల ప్రకారం తమ పెళ్లి జరిగిందనేది అజీమ్‌ వాదన. ఈ మేరకు తనపై మోపిన కేసులను కొట్టివేయాలని అతడు కోరుతున్నాడు. కాగా ఇటీవలే రజ్హా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అజీమ్‌ను భారతీయ ఎంబసీ బృందం జైల్లో కలిసి విషయాన్ని ఢిల్లీ అధికారులకు చేరవేసినట్లు చెబుతున్నారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..