సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కాపు నేతలు సోమవారం సాయంత్రం చంద్రబాబుతో సమవేశం

సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కాపు నేతలు సోమవారం సాయంత్రం చంద్రబాబుతో సమవేశం కాబోతున్నారు. వారం రోజుల క్రితం కాకినాడలో సమావేశం అయ్యారు. వీరంతా ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు, అనేక ప్రాంతాలలో అభ్యర్దులకు నిధులు అందకపోవడం, వంటి అంశాలపై చర్చించారు. తమ అసంతృప్తిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో.. పార్టీ హైకమాండ్ తమను సరిగ్గా పట్టించుకోలేదన్న భావనలో కాపు నేతలు ఉన్నారు. వివిధ అవసరాల కోసం పార్టీ కార్యాలయానికి ఫోన్ చేస్తే కొంతమంది నేతలు దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపు నేతల భేటీలో కీలకంగా వ్యవహరించిన తోట త్రిమూర్తులు హైదరాబాద్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పై చర్చించాలని మరోసారి సమావేశం అవుదామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం బోండా ఉమ ఇంట్లో సమావేశం అయి.. చంద్రబాబు ముందు పెట్టాల్సిన అంశాలపై క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు. నేతలందరికీ వేరే పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడుల నేపధ్యంలో అందరూ డోలాయమాన స్థితిలో ఉన్నారు. సోమవారం చంద్రబాబుతో జరగబోయే భేటీ, అంతకముందు జరగనున్న కాపు నేతల సమావేశం తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. కొంతమంది నేతలు స్థానికంగా వైసీపీ నేతలు నుంచి ఎదరవుతున్న ఒత్తిడిని కూడా ఈ సమావేశం సందర్భంగా ప్రస్తావించాలని భావిస్తున్నారు. బీజేపీ నేతలు నేరుగా కాపు నేతలకు పోన్ చేసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. దీనిపైనా కొంత మంది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..