20 సదస్సులో తీరిక లేకుండా ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్య ఆహ్వానం పంపారు.

ఒసాకా: జీ-20 సదస్సులో తీరిక లేకుండా ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్య ఆహ్వానం పంపారు. ఇప్పటికే రెండు సార్లు చర్చలు విఫలమైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో మూడోసారి కలవడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే ఈసారి ప్రధానంగా ఎటువంటి అజెండా లేకపోయినప్పటికీ.. కేవలం మర్యాదపూర్వకంగా కలవాలనకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా శనివారం తన మనోగతాన్ని వెల్లడించారు.
జీ-20 సదస్సు ముగిసిన అనంతరం ట్రంప్‌ దక్షిణకొరియాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉభయ కొరియా దేశాల సరిహద్దులో కిమ్‌ను కలవాలని అనకుంటున్నానని ట్రంప్‌ తెలిపారు. రెండుసార్లు  చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరు దేశాలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ట్రంప్‌ నుంచి వచ్చిన ఈ ఆహ్వానం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. దీనిపై స్పందించిన ఉత్తరకొరియా.. ట్రంప్‌ ఆహ్వానం ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఇంకా అమెరికా ఎటుంటి అధికారిక సమాచారం లేదని తెలిపింది. ఇటీవల ట్రంప్‌, కిమ్‌ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగిన విషయం తెలిసిందే

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..