కమెడియన్ వేణు మాధవ్ ఇంట విషాదం

ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ ఇంట విషాదం నెలకొంది. వేణుమాధవ్ సోదరుడు, పలు సినిమాలకు సహ నిర్మాతగా పనిచేసిన విక్రమ్ బాబు గుండెపోటుతో చనిపోయారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. వారం రోజుల క్రితమే విక్రమ్ బాబు కుమార్తె పెళ్లి ఘనంగా జరిగింది. అందరు కుటుంబసభ్యులు ఆనందంగా గడిపారు. అయితే, ఇంతలోనే విషాదం నెలకొంది. విక్రమ్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. కాప్రాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటారు. గుండెపోటు రావడంతో ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తలరించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?