ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతలో వైకాపా సర్కార్‌ మరింత కోతపెట్టింది.

అమరావతి

ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతలో వైకాపా సర్కార్‌ మరింత కోతపెట్టింది.

ఇప్పటికే బాబు కుటుంబ సభ్యుల భద్రత తొలగించడం సహా ఆయన వాహనశ్రేణిలోని ఎస్కార్ట్, పైలెట్ క్లియరెన్స్ వాహనాలను తొలగించిన ప్రభుత్వం తాజాగా దాదాపు 15 మంది సిబ్బందిని తొలగించింది.

చంద్రబాబుకు ఉండే ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులతోపాటు వారికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్​ఐల నేతృత్వంలో ని దాదాపు 15మంది సిబ్బందిని పూర్తిగా తప్పించింది రాష్ట్ర ప్రభుత్వం.

ప్రస్తుతం ఇద్దరేసి కానిస్టేబుళ్ల చొప్పున 2బృందాలను కేటాయించింది.

అలిపిరి బాంబు దాడి తర్వాత చంద్రబాబుకు జెడ్‌ ప్లస్‌ సహా ఎన్​ఎస్​జీ భద్రత కల్పించారు.

పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్​ఐల బృందాలతో అప్పటి ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చాయి.

భద్రత రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది