భిక్షగాడే కదా.. అని అందరూ అనుకొన్నారు. ఆయన మృతి అనంతరం తెలిసింది.. లక్షాధికారి అని.
గుంతకల్లు:దర్గాకు వచ్చే భక్తుల నుంచి భిక్షాటన చేసి రూపాయి.. రూపాయి కూడబెట్టాడు. భిక్షగాడే కదా.. అని అందరూ అనుకొన్నారు. ఆయన మృతి అనంతరం తెలిసింది.. లక్షాధికారి అని. వివరాల్లోకి వెళితే... బషీర్ (75) అనే భిక్షగాడు పాతగుంతకల్లులోని మస్తాన్‌వలి స్వామి దర్గాలో బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. విషయాన్ని భక్తులు రెండో పట్టణ పోలీసులకు తెలిపారు. వెంటనే సి.ఐ.అనిల్‌కుమార్, ఎ.ఎస్.ఐ.రామకృష్ణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ రమేష్ దర్గాకు వెళ్లారు. భిక్షగాడి మృదేహాన్ని తరలించడానికి ప్రయతిస్తుండగా సంచులు కనిపించాయి. వాటిని పరిశీలించగా నోట్ల కట్టలు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. వాటిని లెక్కించగా రూ.3,22,676 నగదు ఉన్నట్లు తేలింది. ఈయన గత 12 ఏళ్ల నుంచి దర్గావద్ద భిక్షాటన చేసుకొంటున్నట్లు సి.ఐ. చెప్పారు. ఇతని పేరు బషీర్ అని దర్గా నిర్వాహకులు చెప్పినట్లు తెలిపారు. ఏ ప్రాంతానికి చెందినవాడో తెలియదన్నారు. బషీర్ కూడబెట్టుకొన్న డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమచేస్తున్నట్లు చెప్పారు. ఆయన మృతదేహాన్ని దర్గాకు వచ్చే భక్తులు ఖననం చేస్తారని వివరించారు.
Comments
Post a Comment