కుటుంబంలోని నలుగురు యువతులు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ : ఒకే కుటుంబంలోని నలుగురు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం పరిధిలోని గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఆరుగురూ ఆడపిల్లలే ఉన్నారు. ఎవరికీ వివాహం కాలేదు. ఆరుగురిలో అయిదో అమ్మాయి బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె గురించి వెతకగా ఓ యువకుడితో వెళ్లినట్లు తెలిసింది. తమకన్నా చిన్నది ఇంటి నుంచి వెళ్లిందని, కుటుంబం పరువు పోయిందని మనస్తాపానికి గురైన ఆమె అక్కలు నలుగురు క్రిమి సంహారక మందు తాగారు. ఈ సమయంలో వారిని అడ్డుకోకుండా అందరిలో చిన్నదైన అమ్మాయిని, తల్లిని గదిలో ఉంచి గడియపెట్టారు. తల్లి, చిన్న అమ్మాయి తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేయటంతో గ్రామస్థులు నలుగురిని స్థానిక బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది