నేటి నుండి అమర్నాధ్ యాత్ర ప్రారంభం ..!!

జమ్ము: సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడే శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే అమర్‌నాథ్ యాత్రికుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జమ్ము నుంచి తొలి బృందం ఆదివారం నాడు అమర్‌నాథ్ యాత్రకు బయల్దేరుతుందని అధికారులు పేర్కొన్నారు.

46 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర కోసం ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని,

యాత్రికులకు భద్రతతోపాటు సౌకర్యాల కల్పనకు అన్ని ఏర్పాట్లు చేశామని జమ్ము డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ పేర్కొన్నారు. 

మోదీ ధ్యానంతో ఆ గుహకు భలే డిమాండ్.. 

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌కు వెళ్లిన సందర్భంగా ధ్యానం చేసిన గుహ (ధ్యాన గుహ) సందర్శనకు భక్తులు, యాత్రికుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది.

ఇప్పటికే జులై నెలంతా ఆ గుహకు బుకింగులు పూర్తయ్యాయని ఓ అధికారి తెలిపారు.

ప్రధాని సందర్శించిన తర్వాత ధ్యాన గుహ ఒక్క రోజు కూడా ఖాళీగా లేదని చెప్పారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..