అల్పపీడనంగా ఆవర్తనం

48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

విశాఖ : పశ్చిమ బెంగాల్‌ తీరానికి ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం నాటికి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగానూ, 48 గంటల్లో వాయుగుండంగానూ మారుతుందని అంచనా వేస్తోంది.

దీని ప్రభావంతో మధ్య భారతదేశం, పశ్చిమ, వాయవ్య దేశంలో నైరుతి రుతు పవనాలు విస్తరించేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమల్లో రెండు మూడు రోజులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, సోమవారం కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో నైరుతి పవనాలు చురుగ్గా కదలడంతో ఒడిశా, బెంగాల్‌, జార్ఖండ్‌, బీహార్‌లలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..