కీలక పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ భవిష్యత్ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశామని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని స్పూర్తిగా తీసుకుని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఎలాంటి పదవి లేకపోయినా... పార్టీ పటిష్టత కోసం కృష్టి చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఓటమికి తనతో పాటు మిగతా నేతలు కూడా బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడంతో... అనేక మంది నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు. 

టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి శుక్రవారమే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయగా... నేడు ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు పొన్నం, రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంతో... ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం టీపీసీసీ చీఫ్ పదవిని వదులుకుంటారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. నాగార్జునసాగర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ ఈ అంశంపై పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డ్ చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..