పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

విశాఖపట్నం: 

ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువలో ఇది కేంద్రీకృతమై ఉంది.

దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో రేపటి నుంచి పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

అలాగే రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.

ఈ ఆవర్తనం ఈ నెల 30 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

మరోవైపు, దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ అంచనాలకు భిన్నంగా నిదానంగా సాగుతోంది.

వాతావరణ పరిస్థితులు నైరుతి గమనానికి అనుకూలంగా లేవని వాతావరణ నిపుణులు తెలిపారు.

రానున్న నాలుగు రోజులూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది