టీమిండియా ఆటగాళ్లకు కొత్త రూపు

టీమిండియా ఆటగాళ్లకు కొత్త రూపు రాబోతోంది... ఎప్పుడూ నీలి రంగులో దర్శనమిచ్చే కోహ్లీ సేన ఈ నెల 30న ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆరెంజ్ రంగు జెర్సీ ధరించబోతుంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం పోటీపడే రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించడానికి వీల్లేదు. ఆతిథ్య ఇంగ్లండ్ బ్లూ జెర్సీనే ధరిస్తుండగా.. భారత్ మాత్రం వేరే రంగు జెర్సీని ధరించాల్సి ఉంది.

బీసీసీఐ కోరిక మేరకు టీమిండియాకు ఆరెంజ్ రంగు జెర్సీని కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ నైకీ.. ఈ రోజు జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. ఆ జెర్సీ బ్లూ, ఆరెంజ్ రంగుల సమ్మేళనంతో ఆకట్టుకునేలా ఉంది.

ఎప్పుడూ ‘మెన్ ఇన్ బ్లూ'గా కనిపించే కోహ్లీ సేన.. ఆరెంజ్ రంగు జెర్సీ ధరిస్తుండటం పట్ల క్రీడాభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

భారత క్రికెటర్లు కొత్త లుక్‌లో ఎలా ఉంటారో చూద్దామని ఆత్రుతతో ఉన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది