కట్టుదిట్ట భద్రత మధ్య పవిత్ర అమర్​నాథ్​ యాత్ర సోమవారం ప్రారంభంకానుంది.

జమ్మూ

కట్టుదిట్ట భద్రత మధ్య పవిత్ర అమర్​నాథ్​ యాత్ర సోమవారం ప్రారంభంకానుంది.

యాత్ర కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టారు.

యాత్ర సజావుగా జరిగేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అధికారులను ఆదేశించారు.

భద్రతకు పెద్దపీట...

అమర్​నాథ్​కు చేరుకునేందుకు వినియోగించే బల్టాల్​​, పహల్గమ్​ ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో భద్రతను ఏర్పాటు చేసినట్టు జమ్ము పోలీసులు స్పష్టం చేశారు.

ముఖ్యంగా యాత్ర సమయంలో బల్టాల్​ ప్రాంతానిక ఉగ్రముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు.

ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో యాత్రికుల భద్రతపై పెద్ద ఎత్తున జాగ్రత్తలు చేపట్టారు అధికారులు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యాత్రకు సంబంధించి ఎన్నో సమీక్షలు నిర్వహించింది.

జులై 1 ప్రారంభంకానున్న అమర్​నాథ్​ యాత్ర 40 రోజుల పాటు కొనసాగనుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..