ఈ నెల 2,3 తేదీల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

కుప్పం: 

ఈ నెల 2,3 తేదీల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

తనను కుప్పం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వస్తున్నందుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పడానికి ఈ పర్యటన చేయనున్నారు.

నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో వీలైననన్నీ ఎక్కువ గ్రామ పంచాయతీలలో చంద్రబాబు పర్యటన సాగేలా స్థానిక టీడీపీ నాయకులు రూట్‌ మ్యాప్‌ రూపొందించారు.

ఖచ్చితమైన కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఖచ్చితమైన కార్యక్రమాలను సోమవారం సాయంత్రానికి ఖరారు చేసే అవకాశం ఉంది.

చంద్రబాబు కుప్పం పర్యటన వివరాలను ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ ఆదివారం విలేకరులకు వివరించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..