పట్టిసీమ నీళ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న రైతులకు చల్లని కబురు అందింది.
విజయవాడ:
పట్టిసీమ నీళ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న రైతులకు చల్లని కబురు అందింది.
మరో నాలుగు రోజుల్లో పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణమ్మ ఒడికి చేరబోతున్నాయి.
పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు వరుసగా నాలుగేళ్ల పాటు గోదావరి నీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరింది.
తాజాగా అయిదో ఏడాది ఆ నీరు కర్షకుల కలలను పండించబోతోంది.
పట్టిసీమ ఎత్తిపో తల పథకం వద్ద మొత్తం 24 పంపులు ఉన్నాయి.
వాటిలో మూడింటిని బుధవారం సా యంత్రం ఆన్ చేశారు.
ప్రస్తుతం గోదావరిలో మూడు వేల క్యూసెక్కుల నీరు సర్‌ప్లస్‌లో ఉంది.
గురువారం మరో రెండు పంపులను ఆన్ చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
గడచిన ఏడాది ప్రకాశం బ్యారేజ్ నుంచి జూన్ 20వ తేదీన తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేశారు.
ఈసారి ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకా శాలు కనిపిస్తున్నాయి.
ఎగువన పెద్ద వర్షాలు కురవకపోవడం, తగినంత నీరు గోదావరిలోకి రాకపోవడంతో ఈసారి నీటిని ఎత్తిపోయడంలో జాప్యం జరిగింది.
Comments
Post a Comment