విద్యార్థుల గొంతెండుతోంది
విద్యార్థుల గొంతెండుతోంది!!
నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలో ఉన్న అర్మేనిపాడు ఉన్నత పాఠశాలలో గత నెల రోజులుగా బోరు పనిచేయక పనిచేయకపోవడంతో విద్యార్థులు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
అక్కడ 140 మందికి పైగా విద్యార్థులుండగా ఉన్న బోరు ఎండిపోవడంతో వారు ఇంటి వద్ద నుoడి వాటర్ బాటిల్ లో నీరు తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాహం తీరక పాఠశాలలో నీరు లేకపోవడంతో సాయంత్ర0 ఇంటికి వెళ్లి నీరు త్రాగవలవస్తోంది.
సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డీ. ఓ కు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని తెలుస్తోంది.
ఇప్పటికైనా పంచాయతీ అధికారులు మండల అధికారులు స్పందించి బోరును రిపేరు చేయించి విద్యార్థులకు త్రాగు నీరు అందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Comments
Post a Comment