ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ నిబంధన సోమవారం నుంచే అమలుకానుంది.

అన్నవరం: 

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ నిబంధన సోమవారం నుంచే అమలుకానుంది.

తొలుతగా కేవలం ఆర్జితసేవలకు మాత్రమే ఈ నిబంధన పరిమితం చేశారు.

కానీ ప్రస్తుతం వ్రతాలు, కల్యాణాలు, హారతిసేవ, సహస్రదీపాలంకరణ తదితర సేవల్లో పాల్గొనే పురుషులు తప్పనిసరిగా పంచె, కండువా, కుర్తా, పైజమా... మహిళలు చీర, జాకెట్టు చున్నీతో కూడిన పంజాబీడ్రెస్‌ ధరించాలి.

ఇప్పటికే తిరుపతి, విజయవాడ తదితర దేవస్థానాల్లో వస్త్రధారణ నిబంధనలు అమలుచేస్తుండగా ఆ జాబితాలో అన్నవరం చేరింది.

దీనికి సంబంధించి దేవస్థానం అధికారులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్త్రత ప్రచారం చేపట్టారు.

రత్నగిరిపై పలు ప్రధాన కూడళ్లలో భక్తులకు తెలిసేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఈ నిబంధన తెలియని భక్తులు ఎవరైనా వచ్చినా వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆప్కో, ఖాదీల ద్వారా రత్నగిరిపై తక్కువధరలో దుస్తులు విక్రయాలు చేపట్టారు.

ఆదిలోనే నిబంధన కఠినతరం చేయకుండా కొంత సడలింపు ఇవ్వాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తుల్లో 70శాతంమంది వ్రతాలు ఆచరించుకునేవారుంటారు.

దీంతో రత్నగిరిపై ఎక్కడచూసినా సంప్రదాయ వస్త్రాల్లోనే భక్తులు కనిపించనున్నారు.

ఈ నిబంధన భవిష్యత్తులో దర్శనాలకు వర్తింపచేసే ఆలోచన చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..